అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత చట్టాల్లో మార్పులు చేయడం ప్రారంభించారు. తాజాగా అమెరికన్ వ్యాపారాలను పరిరక్షించాలనే పేరుతో ఓ కీలక చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. “Foreign Corrupt Practices Act (FCPA)” అనే చట్టాన్ని సస్పెండ్ చేసి వ్యా

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

పాత చట్టాల దుమ్ము దులుపుతున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత చట్టాల్లో మార్పులు చేయడం ప్రారంభించారు. తాజాగా అమెరికన్ వ్యాపారాలను పరిరక్షించాలనే పేరుతో ఓ కీలక చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. “Foreign Corrupt Practices Act (FCPA)” అనే చట్టాన్ని సస్పెండ్ చేసి వ్యాపార విభాగాలకు ఉపశమనం కల్పించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.

FCPA అంటే ఏంటి అంటే..

1977లో ప్రవేశపెట్టిన FCPA చట్టం ప్రకారం.. అమెరికన్ కంపెనీలు లేదా వారి ప్రతినిధులు విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం అంతర్జాతీయ వ్యాపారాల్లో అవినీతిని అరికట్టే ప్రధాన చర్యగా ఇంతకాలం అమలులో ఉంది. అయితే, అమెరికా కంపెనీల పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ట్రంప్ వాదన.

FCPA అమలు వల్ల అమెరికన్ కంపెనీలు చాలా దేశాల్లో వ్యాపారం చేయడానికి ఇబ్బంది పడుతున్నాయని, కొన్ని దేశాల్లో వ్యాపారం చేసేందుకు స్థానిక అధికారులను ముడుపులు ఇచ్చే అవసరం వస్తుందని, ఈ చట్టం కారణంగా అమెరికా వ్యాపారాలు వెనుకబడుతున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అందుకే ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించకపోయినా, తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై కూడా FCPA చట్టం ప్రకారం విచారణ జరుగుతోంది. విదేశీ సంస్థలకు అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో ఈ చట్టం ప్రస్తావనకు వచ్చింది. అయితే ట్రంప్ ఈ చట్టాన్ని నిలిపివేయడం వల్ల, ఇలాంటి కేసులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది అవినీతికి తలుపులు తెరుచే ప్రమాదముందని, అమెరికా వ్యాపార ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని అంటున్నారు.

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్
disclaimer

What's your reaction?

Comments

https://timessquarereporter.com/public/assets/images/user-avatar-s.jpg

0 comment

Write the first comment for this!

Facebook Conversations