రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
మార్చి 24న జరగనున్న తదుపరి విచారణలో తన పక్షాన్ని సమర్పించాలని ఆదేశించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ.. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. 2022 డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా ముందు వివాదాస్పద ప్రకటన చేశారని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత సైనిక దళాలను అవమానించేవిగా, అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు

సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు పంపింది. దేశవ్యాప్తంగా రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు ఈ సమన్లు ​​జారీ చేసింది. మార్చి నెలలో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. భారత సైన్యానికి సంబంధించి చేసిన ఆరోపణలపై అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అలోక్ వర్మ కాంగ్రెస్ ఎంపీకి సమన్లు జారీ చేశారు.

image

మార్చి 24న జరగనున్న తదుపరి విచారణలో తన పక్షాన్ని సమర్పించాలని ఆదేశించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ.. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. 2022 డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా ముందు వివాదాస్పద ప్రకటన చేశారని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత సైనిక దళాలను అవమానించేవిగా, అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యపై లోక్‌సభ ప్రతిపక్ష నేతపై ఫిబ్రవరి 11న ప్రత్యేక కోర్టు మరో పరువు నష్టం కేసును విచారించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. ఆ రోజు సాక్షిని విచారించనున్నారు. ఈ కేసులో సంబంధిత ఆధారాలను సమర్పించాలని కూడా కోర్టు ఫిర్యాదుదారుడిని ఆదేశించింది. గత ఐదు సంవత్సరాలుగా ఈ కేసు అనేక విచారణల ద్వారా ముందుకు వెళ్ళింది. కానీ రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కాలేదు.

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
disclaimer

What's your reaction?

Comments

https://timessquarereporter.com/public/assets/images/user-avatar-s.jpg

0 comment

Write the first comment for this!

Facebook Conversations