views
నాణేల ముద్రణపై ట్రంప్ నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పెన్నీ (1 సెంటు) నాణేల ముద్రణపై నిషేధం విధించారు, దింతో దేశ బడ్జెట్ నుండి అనవసర ఖర్చులు తొలగించాలనే ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఒక పైసా ముద్రించడానికి అయ్యే ఖర్చు వాస్తవానికి 2 సెంట్ల కంటే ఎక్కువ అని, ఇది ప్రభుత్వానికి నష్టమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటన డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో “చాలా సంవత్సరాలుగా అమెరికా అనవసరంగా పెన్నీ నాణేలను ముద్రిస్తోంది, దీనివల్ల మనకు దాని విలువ కంటే ఎక్కువ ఖర్చవుతోంది. ఇది వెస్ట్! కొత్త పెన్నీల సృష్టిని ఆపమని నేను ఆర్థిక మంత్రికి సూచించాను అంటూ పోస్ట్ చేసారు.
![నాణేల ముద్రణపై ట్రంప్ నిషేధం](https://vaartha.com/wp-content/uploads/2025/02/Donald-Trump-warnings-to-the-EU-1024x576.jpg.webp)
ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ఆలోచన
న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన సూపర్ బౌల్ 2025 మొదటి అర్ధభాగంలో డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రభుత్వం ఖర్చులను తగ్గించడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది ఇంకా ప్రభుత్వ సంస్థలను రద్దు చేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలలో పావులను కదుపుతుంది. ఎలోన్ మస్క్ DOGE టీం ఆర్థిక అవకతవకల వెల్లడి డోనాల్డ్ ట్రంప్ ప్రకారం, ఎలోన్ మస్క్ “డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ” (DOGE) ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో చాల వరకు ఆర్థిక అవకతవకలను కనుగొంది. కొన్ని ప్రభుత్వ చెల్లింపులు తప్పుగా నివేదించి ఉండవచ్చని, దీనివల్ల అమెరికా రుణ పరిస్థితి వాస్తవ గణాంకాలు సూచించిన దానికంటే దారుణంగా ఉన్నయని అంటూ ఆయన సూచించారు.
డేటా ధ్వసంకు ఆదేశం
కొత్త పేమెంట్ సిస్టం రివ్యూ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మెంట్ సిస్టంను సమీక్షించి మెరుగుపరచడం వల్ల భవిష్యత్తులో దేశ బడ్జెట్ లోటును తగ్గించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఒక ఫెడరల్ న్యాయమూర్తి DOGE ట్రెజరీ డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధించారు అలాగే సేకరించిన డేటాను ధ్వసం చేయాలని ఆదేశించారు. భారతదేశ ఉక్కు పరిశ్రమ ఇప్పటికే ప్రపంచ పోటీని ఎదుర్కొంటోంది కాబట్టి, US సుంకాలు దీనికి కారణం కావచ్చు. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 12న అమెరికాకు వెళ్లి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
![నాణేల ముద్రణపై ట్రంప్ నిషేధం](https://timessquarereporter.com/public/index.php/upload/media/posts/2025-02/12/naanneel-mudrnnpai-ttrnp-nisseedhn_1739337512-b.jpg)
![disclaimer](https://www.timessquarereporter.com/disclaimer-timessquarereporter.jpg)
Comments
0 comment