views
మానవాళికి ఏఐ అనేది ఒక కోడ్‌లా మారింది
కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ప్రపంచంలోని అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పారిస్‌లో జరిగిన ఏఐ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక వ్యవస్థలను సమూలంగా మారుస్తోందని, భవిష్యత్తులో దీనిప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ శతాబ్దంలో మానవాళికి ఏఐ అనేది ఒక కోడ్‌లా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ ప్రజలకు సమానంగా అందుబాటులోకి రావాలని అన్నారు. ఏఐ వినియోగం కేవలం కొద్ది మంది చేతుల్లో కాకుండా, అన్ని దేశాలు దీని ప్రయోజనాలను అనుభవించగలిగేలా చేయాలని సూచించారు. భారతదేశం ఈ రంగంలో అనేక పురోగతులు సాధించిందని, తమ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మోదీ తెలిపారు. వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషించగలదని చెప్పారు.
![modi france](https://vaartha.com/wp-content/uploads/2025/02/modi-france.jpg.webp)
ఏఐ టెక్నాలజీ వల్ల కలిగే లాభాలు మానవాళికి పెద్ద వరంగా మారాలని మోదీ ఆకాంక్షించారు. అయితే, దీని విస్తరణలో నైతికత, పారదర్శకత, భద్రత వంటి అంశాలను ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు. ఏఐ సద్వినియోగంతోనే దీని అసలైన ప్రయోజనాలు సమాజానికి అందుతాయని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధికి, సమానమైన అవకాశాలకు, భద్రతకు ఏఐ టెక్నాలజీ వినియోగించబడాలని మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ కొత్త టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటుందని, ప్రపంచ దేశాలు కలిసి పనిచేయడం ద్వారా ఏఐని మరింత ప్రయోజనకరంగా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
![మానవాళికి ఏఐ అనేది ఒక కోడ్‌లా మారింది](https://timessquarereporter.com/public/index.php/upload/media/posts/2025-02/12/maanvaalliki-eeai-aneedi-ok-kooddlaa-maarindi_1739337166-b.jpg)
![disclaimer](https://www.timessquarereporter.com/disclaimer-timessquarereporter.jpg)
Comments
0 comment